చిట్కాలు
దగ్గరలోని బస్ స్టాప్‌లను కనుగొనడానికి, సమీప స్థలాలు ఎంచుకుని ప్రజా రవాణా ఎంచుకోండి.
మీరు తరచూ అదే బస్సులో ప్రయాణిస్తే, మీ స్టాప్‌లను మార్కర్‌లుగా సేవ్ చేయండి. మీరు దిగే స్టాప్‌పై బీకాన్‌ను సెట్ చేయండి, ప్రయాణంలో అది ఎంత దూరంలో ఉందో Soundscape చెబుతుంది.
మీరు బీకాన్‌ను మ్యూట్ చేసినా స్థలం ఎంత దూరంలో ఉందో వినవచ్చు. మీరు కదులుతున్నప్పుడు Soundscape అప్పుడప్పుడూ దూరాన్ని చెబుతుంది.
వెళ్లే ముందు ఒక స్థలాన్ని అన్వేషించడానికి, దాని స్థాన వివరాలు తెరిచి స్థానాన్ని అనుకరించు ఎంచుకోండి. అప్పుడు మీరు అక్కడే ఉన్నట్లుగా Soundscape పని చేస్తుంది.
మలుపు మలుపుకూ దారి సూచనల కోసం, ఒక స్థలం యొక్క స్థాన వివరాలు తెరిచి మ్యాప్ యాప్‌లో తెరువు ఎంచుకోండి. వేరే యాప్ దారి సూచనలు ఇస్తున్నప్పుడు Soundscape నడుస్తూనే ఉంటుంది.